Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైల్లో హీరో ద‌ర్శ‌న్‌కు గ‌త కొన్నిరోజులుగా నిద్ర‌లేని రాత్రులు.. అందుకు షాకింగ్ కార‌ణం చెప్పిన న‌టుడు!

Jailed Actor Darshan Complains on Fan Rnukaswamy Sole
Advertisement
  • అభిమాని రేణుకాస్వామి హ‌త్య కేసులో బ‌ళ్లారి జైల్లో విచార‌ణ ఖైదీగా ద‌ర్శ‌న్
  • రేణుకాస్వామి ఆత్మ త‌న‌ను వెంటాడుతోంద‌న్న న‌టుడు
  • ఆ భ‌యంతోనే రాత్రుల్లో నిద్ర‌ప‌ట్ట‌డంలేద‌ని జైలు అధికారుల‌కు ఫిర్యాదు
  • త‌న‌ను వెంట‌నే బెంగ‌ళూరు జైలుకు త‌ర‌లించాల‌ని అభ్య‌ర్థ‌న‌
Advertisement
అభిమాని రేణుకాస్వామి హ‌త్య కేసులో క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ విచార‌ణ ఖైదీగా ప్ర‌స్తుతం బ‌ళ్లారి జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, జైల్లో హీరో ద‌ర్శ‌న్‌ గ‌త కొన్నిరోజులుగా నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నాడ‌ట‌. దీనికి జైలు అధికారుల‌తో న‌టుడు షాకింగ్ కార‌ణం చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

రేణుకాస్వామి ఆత్మ త‌న‌ని వెంటాడుతోంద‌ని, ప్రతిరోజు రాత్రి త‌న క‌ల‌లోకి వ‌చ్చి భ‌య‌పెడుతోందని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఆ భ‌యంతోనే త‌న‌కు రాత్రుల్లో నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని ఆయ‌న జైలు అధికారుల‌కు చెప్పార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

ఈ నేప‌థ్యంలోనే త‌న‌ను వెంట‌నే బెంగ‌ళూరు జైలుకి త‌ర‌లించాల్సిందిగా అధికారుల‌తో అభ్య‌ర్థించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ద‌ర్శ‌న్ అర్ధ‌రాత్రి స‌మ‌యంలో నిద్ర‌లో ఉండ‌గా క‌ల‌వ‌రిస్తూ, గ‌ట్టిగా అరుస్తున్నాడ‌ని తోటి ఖైదీలు కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. 

ఇదిలాఉంటే.. అభిమాని రేణుకాస్వామిని హీరో ద‌ర్శ‌న్ మ‌రికొంద‌రితో క‌లిసి చిత్ర‌హింస‌ల‌కు గురి చేసి హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ హ‌త్య కేసులో హీరోయిన్ ప‌విత్ర గౌడ‌, ద‌ర్శ‌న్‌తో పాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు క‌ర్ణాట‌క‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. 

ఇక‌ ప్ర‌స్తుతం బ‌ళ్లారి జైలులో ఉన్న ద‌ర్శ‌న్ ఇటీవ‌ల బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఇవాళ విచార‌ణ జ‌ర‌గ‌నుంది.
Advertisement
Advertisement
Darshan
Rnukaswamy
Karnataka

More Telugu News